బాలిక కిడ్నాప్ కలకలం.. జనసేన ఇన్‌చార్జ్ సోదరుడిపై ఫిర్యాదు – TV9

బాలిక కిడ్నాప్ కలకలం.. జనసేన ఇన్‌చార్జ్ సోదరుడిపై ఫిర్యాదు – TV9

అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలం బీగువారిపల్లిలో 17 ఏళ్ల మైనర్ బాలిక కిడ్నాప్ కావడం స్థానికంగా కలకలం రేపింది. ఇంటర్ చదువుతున్న బాలికను తంబళ్లపల్లి జనసేన ఇన్‌చార్జ్ సోదరుడైన 40 ఏళ్ల హరినాథ్ మాయమాటలతో అపహరించినట్లు తండ్రి ఆదినారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత మూడు నెలల క్రితమే వీరి మధ్య గొడవ జరగడంతో తల్లిదండ్రులు బాలికను కాలేజీకి పంపడం మానేశారు. అయినప్పటికీ ఈ నెల 19న గ్రామంలో భయభ్రాంతులకు గురిచేసి ఆమెను కిడ్నాప్ చేశారని బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తండ్రి కన్నీరుమున్నీరవుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించి తమ బిడ్డను అప్పగించాలని వారు కోరుతున్నారు.

🔔 Subscribe to TV9 Telugu & press the Bell Icon for breaking news alerts.
👍 Like | Comment | Share

Follow TV9 Telugu on Social Media:
► TV9 News App : https://onelink.to/de8b7y
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N

#Mulakalacheruvu #KIidnap #apnews #tv9telugu

社会・政治ニュース動画カテゴリの最新記事